Dil Raju: దిల్ రాజు ఓటీటీ రంగంలో దిగుతున్నాడన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

Sri Venkateswara Creations condemns Dil Raju will commence own OTT platfarm
  • దిల్ రాజు ఓటీటీ ప్లాట్ ఫాం ప్రారంభిస్తున్నాడంటూ వార్తలు
  • చిన్న సినిమాల కోసం సొంతంగా ఓటీటీ అంటూ ప్రచారం
  • ఖండించిన దిల్ రాజు చిత్ర నిర్మాణ సంస్థ  
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమ బ్యానర్ పై చిన్న సినిమాలు నిర్మించి వాటిని సొంత ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. దీనిపై దిల్ రాజుకు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించింది. 

దిల్ రాజు ఓటీటీ ప్లాట్ ఫాం ప్రారంభిస్తున్నాడన్న వార్తలను ఖండించింది. దిల్ రాజుపై వస్తున్న పుకార్లను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజంలేదని, నిర్ధారణ కాని ఇటువంటి వార్తలకు దూరంగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పష్టం చేసింది.
Dil Raju
OTT Platfarm
Sri Venkateswara Creations
Tollywood

More Telugu News