Air Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం... మళ్లీ సరి, బేసి విధానం
- దేశ రాజధానిలో ఆందోళన కలిగిస్తున్న గాలి నాణ్యత
- అత్యవసరంగా సమావేశమైన ఢిల్లీ క్యాబినెట్
- దీపావళి తరువాతి రోజు నుంచి సరి, బేసి విధానం
- ఈ నెల 13 నుంచి 20 వరకు అమలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో, ఢిల్లీ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. గతంలో అమలు చేసిన సరి, బేసి విధానాన్ని మళ్లీ తీసుకురావాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి తరువాతి రోజు నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు సరి, బేసి విధానం ప్రకారం వాహనాలపై ఆంక్షలు ఉంటాయని వివరించింది.