azaruddin: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు కోర్టులో భారీ ఊరట

Big relief to Congress Jubilee Hills candidate Azaruddin
  • హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు
  • కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు  
  • అజారుద్దీన్‌కు బెయిల్ మంజూరు చేసిన మల్కాజిగిరి కోర్టు
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. మల్కాజిగిరి కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అజారుద్దీన్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆయనకు నేడు బెయిల్ లభించింది. 

ఫండ్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన లావు నాగేశ్వరరావు కమిటీ ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సోమవారం నాడు విచారించిన న్యాయస్థానం అజారుద్దీన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
azaruddin
Congress
Telangana Assembly Election
Jubilee Hills

More Telugu News