muralidhar rao: అందుకే బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు: మురళీధరరావు కీలక వ్యాఖ్యలు

Muralidhar Rao interesting comments on Bandi Sanjay and Rajagopal Reddy
  • సంజయ్ సీఎం రేసులో ఉన్నారన్న మురళీధరరావు
  • కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రేసులో లేరని స్పష్టీకరణ
  • అందుకే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని వెల్లడి
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారంటూ ఆ పార్టీ నేత మురళీధరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్ సీఎం రేసులో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కాబట్టే అధ్యక్ష పదవి నుంచి తొలగించారన్నారు. కేంద్రమంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి రేసులో లేరన్నారు. అందుకే ఆయనకు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ బీజేపీలోకి రావొచ్చునని షాకింగ్ కామెంట్స్ చేశారు.
muralidhar rao
Bandi Sanjay
G. Kishan Reddy
BJP
Telangana Assembly Election

More Telugu News