Nitish Kumar: జనాభా నియంత్రణపై బీహార్ సీఎం స్పీచ్.. వల్గర్ అంటూ మండిపడుతున్న ప్రతిపక్షాలు.. వీడియో ఇదిగో!

Nitish Kumar makes vulgar speech about population control in Assembly
  • అసెంబ్లీలో నితీశ్ కుమార్ స్పీచ్ పై రగడ
  • ‘సెక్స్ ఎడ్యుకేషన్’ అంటూ సమర్థించిన డిప్యూటీ సీఎం తేజస్వీ
  • స్కూలులో పిల్లలు చదువుకుంటారని వివరణ 
బీహార్ అసెంబ్లీలో దుమారం రేగింది. నిండు సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వల్గర్ గా మాట్లాడారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. జనాభా నియంత్రణపై ఆయన చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తుండగా.. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్థించారు. బీహార్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందీ అంశం.. ఇంతకీ ఏంజరిగిందంటే..

అసెంబ్లీ సమావేశాలలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ జనాభా నియంత్రణ ఇష్యూను ప్రస్తావించారు. జనాభా నియంత్రణ విషయం విషయంలో మహిళలే చొరవ తీసుకోవాలని చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నితీశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఇదంతా మాట్లాడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు నవ్వుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నితీశ్ వ్యాఖ్యలపై డిప్యూటి సీఎం తేజస్వీ యాదవ్ అసెంబ్లీ బయట మీడియాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదంతా సెక్స్ ఎడ్యుకేషన్ అని, ప్రస్తుతం స్కూలు విద్యార్థులు కూడా దానిని చదువుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం సరికాదని తేజస్వీ తెలిపారు.
Nitish Kumar
Bihar
Assembly session
vulgar speech
nitish
Tejashwi Yadav

More Telugu News