Angelo Mathews: హెల్మెట్ జాగ్రత్త.. లేకపోతే ‘టైమ్డ్ ఔట్’..ఒడిశా రవాణా శాఖ పోస్ట్ వైరల్

Odisha state transport authority creates awareness about helmet quality through angelo mathews timed out incident

  • హెల్మెట్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రవాణా శాఖ వినూత్న ప్రచారం  
  • హెల్మట్ నాణ్యత లేకపోతే వికెట్ పడిపోతుందని హెచ్చరిక
  • నెటిజన్లకు విపరీతంగా నచ్చిన పోస్టు నెట్టింట వైరల్

ట్రాఫిక్ నిబంధనల గురించి వివిధ రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణలో జరిగిన యాక్సిడెంట్లకు సంబంధించి వీడియోలను ట్రాఫిక్ పోలీసులు యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్ చేస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నారు. అయితే, హెల్మెట్ నాణ్యతపై అవగాహన కల్పించేందుకు ఒడిశా రవాణా శాఖ వినూత్న పంథాను ఎంచుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇటీవలి మ్యాచ్ లో శ్రీలంక క్రీడాకారుడు ఏంజెలా మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ అయిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తాజాగా నెట్టింట పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. చెత్త క్వాలిటీ హెల్మెట్లతో మైదానంలో అయినా.. మైదానం వెలుపల అయినా వికెట్ పడిపోతుందని హెచ్చరించింది. హెల్మెట్ల నాణ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓడిశా రవాణా శాఖ ప్రయత్నం నెటిజన్లకు నచ్చడంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

  • Loading...

More Telugu News