Kandlakoya: మేడ్చల్‌లో నాలుగో అంతస్తు నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

Engineering Student Committed Suicide In Medchal District
  • కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో నాలుగో ఏడాది చదువుతున్న సంజయ్
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా
మేడ్చల్ జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో ఏడాది చదువుతున్న 21 ఏళ్ల సంజయ్ కాలేజీ నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం సంజయ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. యువకుడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Kandlakoya
Engineering Student
Suicide
Medchal Malkajgiri District

More Telugu News