bandla ganesh: తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు మద్దతివ్వడంపై బండ్ల గణేశ్ ఆసక్తికర సమాధానం

Bandla Ganesh interesting comments on support to pawan kalyan
  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్విస్తున్నానన్న బండ్ల  
  • తనకు పవన్ కల్యాణ్ దేవుడితో సమానమని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పార్టీ కూడా దేవుడితో సమానమన్న గణేశ్ 
  • ఏడుకొండలవాడు... పరమేశ్వరుడు.. ఇద్దరూ దేవుళ్లేనని సమాధానం
  • తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు మద్దతిస్తారా? అని అడిగితే ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర సమాధానం చెప్పారు. తాను గాంధీ భవన్‌లో కూర్చొని చెబుతున్నానని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్విస్తున్నానన్నారు. పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానమన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తనకు దేవుడితో సమానమన్నారు. తాను హిందువునని, పరమేశ్వరుడు దేవుడే... ఏడుకొండలవాడు దేవుడే అన్నారు. అలా తనకు పవన్, కాంగ్రెస్ ఇరువురూ దేవుళ్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాను తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ఏడో తేదీనే తాను ఎల్బీ స్టేడియంకు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటానన్నారు. మరి మీ దేవుడు పవన్ పార్టీ పోటీ చేస్తుంది కదా? అని ప్రశ్నించగా... తాను పవన్ అభిమానినే అయినప్పటికీ ఎన్నికల్లో మద్దతివ్వనన్నారు.
bandla ganesh
Telangana Assembly Election
Pawan Kalyan
BJP
Janasena

More Telugu News