Tirumala: రేపు తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల

Tirumala Vaikunta Darshan tickets will be released tomorrow
  • జనవరి 1న తిరుమలకు పెద్ద ఎత్తున తరలి రానున్న భక్తులు
  • నవంబరు 10న వివిధ రకాల టికెట్ల విడుదల
  • ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించిన టీటీడీ
తిరుమల శ్రీవారికి సంబంధించిన వివిధ టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. నవంబరు 10న... తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు.

రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. టీటీడీ 2.25 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనుంది. 

రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు 20 వేల టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. 

వసతి గదుల కోటాను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తిస్తాయి. 

ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Tirumala
Vaikunta Dwara Darshan
Tcikets
TTD

More Telugu News