Ibrahim Zadran: బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టిన ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్
- ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్ లో 376 పరుగులు చేసిన జద్రాన్
- 1992లో 333 రన్స్ చేసిన లారా
- 523 పరుగులతో తొలి స్థానంలో ఉన్న సచిన్
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్థాన్ సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద జట్లను ఆఫ్ఘన్ టీమ్ చిత్తు చేసింది. మరోవైపు ఆఫ్ఘన్ స్టార్ క్రికెటర్ జద్రాన్ అరుదైన ఘనత సాధించాడు. 23 ఏళ్ల వయసులోపు ఒక వన్డే ఎడిషన్ లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్ గా నిలిచాడు. 1996 వరల్డ్ కప్ లో సచిన్ 523 పరుగులు సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. 1992 ప్రపంచకప్ లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 333 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో జద్రాన్ ఇప్పటి వరకు 376 పరుగులు సాధించి లారాను అధిగమించాడు.