Odisha: ఒడిశాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం.. ఆరో తరగతి బాలికపై ఇద్దరు ఉపాధ్యాయుల అత్యాచారం

11 year girl gang raped by two teachers inside bathroom in Odisha
  • నబరంగ్‌పూర్ జిల్లాలో ఘటన
  • బాలిక టాయిలెట్‌లో ఉండగా బలవంతంగా వెళ్లి అత్యాచారం
  • కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు
  • బాలికపై అత్యాచారం జరిగినట్టు గుర్తించిన వైద్యులు
  • హెడ్మాస్టర్, మరో ఉపాధ్యాయుడి అరెస్ట్
  • రాష్ట్రవ్యాప్తంగా దుమారం  
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో దారుణం జరిగింది. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం నిందితులిద్దరూ కటకటాలు లెక్కిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 7న బాలిక టాయిలెట్‌లో ఉండగా హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడు బలవంతంగా గదిలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండ్రోజుల తర్వాత కడుపునొప్పిగా ఉందని బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

పరీక్షించిన వైద్యులు బాలికపై లైంగికదాడి జరిగినట్టు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దిగ్భ్రాంతికి గురైన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెడ్మాస్టర్‌తోపాటు మరో ఉపాధ్యాయుడిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండగా.. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య వైద్యాధికారిని కోరింది. బాలికకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.
Odisha
Nabarangpur
Crime News
Teachers

More Telugu News