MIM: బీఫాం ఇచ్చినా పత్తాలేని ఎంఐఎం అభ్యర్థి.. చివరి నిమిషంలో మరో అభ్యర్థి నామినేషన్

MIM Rajendranagar Candidate missing nomination party fields another one
  • రాజేంద్రనగర్ నుంచి రాజు యాదవ్‌ను బరిలోకి దింపిన ఎంఐఎం
  • అధిష్ఠానానికి, కార్యకర్తలకు అందుబాటులోకి లేకుండా పోయిన అభ్యర్థి
  • స్వామి యాదవ్‌తో నామినేషన్ వేయించిన పార్టీ
రాజేంద్రనగర్ ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ వేయకపోవడంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తమకు పట్టున్న ప్రాంతాల్లో ఎంఐఎం అభ్యర్థులను బరిలోకి దింపింది. నిన్నటితో నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఈ క్రమంలో నిన్న రాజేంద్రనగర్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. గతంలో ఎంఐఎం కార్పొరేటర్‌గా పనిచేసిన రవియాదవ్‌కు పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయించింది.

టికెట్ కేటాయించి బీఫాం ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ అధిష్ఠానానికి కానీ, కార్యకర్తలకు కానీ అందుబాటులో లేకుండా పోయారు. నామినేషన్ కూడా వేయకపోవడంతో గాభరా పడిన పార్టీ.. వెంటనే కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్‌కు బీఫాం ఇచ్చి నామినేషన్ దాఖలు చేయించి ఊపిరి పీల్చుకుంది.
MIM
Asaduddin Owaisi
Rajendrangar
Ravi Yadav

More Telugu News