Abundance In Millets: గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన మోదీ 'మిల్లెట్స్' పాట!
- 2023ను తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న ప్రపంచం
- ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్’ పాటను విడుదల చేసిన ప్రధాని మోదీ
- బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్ కేటగిరీలో గ్రామీ అవార్డుకు నామినేట్
సాహిత్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారం అందించిన పాట సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుకు బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్ కేటగిరీలో నామినేట్ అయింది. 2023 ఏడాదిని ప్రపంచ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకొంటున్న నేపథ్యంలో మిల్లెట్స్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ పాటను జూన్‌లో ప్రధాని మోదీ విడుదల చేశారు.
ప్రముఖ ఇండో అమెరికన్ గాయని ఫాల్గుణి షా (ఫాలూ), ఆమె భర్త గౌరవ్‌షా సంయుక్తంగా రూపొందించగా, ప్రధాని మోదీ సాహిత్యంలో సహకరించారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలైన ఈ పాటలో పలు సందర్భాల్లో మిల్లెట్స్‌పై మోదీ ప్రసంగాన్ని యథాతథంగా ఈ పాటలో వాడుకున్నారు. ఇప్పుడీ పాట గ్రామీ అవార్డుకు నామినేట్ కావడం విశేషం.