world cup 2023: మ్యాక్స్ వెల్ నిజంగానే సచిన్ కు పాదాభివందనం చేశాడా.. వైరల్ ఫొటో వెనక అసలు నిజం ఇదిగో!

Australian cricketer Maxwell touching Sachin Tendulkars feet Photo Fake

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఫేక్
  • ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న క్రికెటర్లు
  • సచిన్ పాదాలకు మ్యాక్స్ వెల్ మొక్కుతున్నట్లు మార్పింగ్

అనారోగ్యంతో బాధపడుతున్నా లెక్క చేయకుండా ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఆటను క్రికెట్ అభిమానులు మర్చిపోలేరు. అయితే, ఈ మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్ కు మ్యాక్స్ వెల్ పాదాలకు నమస్కరించాడని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటో నిజం కాదని, మార్పింగ్ చేశారని తాజాగా బయటపడింది.

ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ డబుల్ సెంచరీ సాధించిన తీరు ప్రతీ క్రికెట్ అభిమానినీ ఆకట్టుకుంది. అయితే ఆఫ్ఘన్ ప్లేయర్ల పోరాటాన్నీ తక్కువ చేయడానికి లేదు. ఈ క్రమంలోనే మ్యాచ్ ముగిశాక సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వెళ్లారు. ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. ఈ క్రమంలోనే మ్యాక్స్ వెల్ కూడా మైదానంలోకి వచ్చి సచిన్ తో కరచాలనం చేశాడు. ఈ ఫొటోను గుర్తుతెలియని వ్యక్తులు మార్పింగ్ చేశారు.

సచిన్ పాదాలకు మ్యాక్స్ వెల్ నమస్కరిస్తున్నట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదే భారతీయ సంప్రదాయమంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే, ఈ ఫొటోను కాస్త పరిశీలించి చూస్తే.. సచిన్ టెండూల్కర్, మ్యాక్స్ వెల్ కరచాలనం చేసిన ఫొటో అని తేలిగ్గా తెలిసిపోతోంది.

  • Loading...

More Telugu News