PM Modi: చంద్రమోహన్ మృతిపై తెలుగులో పోస్టు చేసిన ప్రధాని మోదీ

PM Modi responds to Chandramohan demise
  • సీనియర్ నటుడు చంద్రబాబు కన్నుమూత
  • చంద్రమోహన్ మృతి అత్యంత బాధాకరమని పేర్కొన్న మోదీ
  • చంద్రమోహన్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని వెల్లడి
సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇవాళ కన్నుమూసిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ఆయన తెలుగులో పోస్టు చేశారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్ మృతి చెందడం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. సినీ ప్రపంచంలో ఆయన ఓ వెలుగు వెలిగారని కీర్తించారు. వారి ఉత్తమమైన నటన, ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయని ప్రధాని మోదీ కొనియాడారు. చంద్రమోహన్ నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో భర్తీ చేయలేని ఒక శూన్యతను కలిగించిందని అభిప్రాయపడ్డారు. ఈ విషాద సమయంలో చంద్రమోహన్ కుటుంబానికి, ఆయన అభిమానులకు సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
PM Modi
Chandramohan
Demise
Andhra Pradesh
Telangana

More Telugu News