Vijayashanti: పార్టీ మార్పు వాఖ్యలకు చెక్ పెట్టిన విజయశాంతి.. మోదీ సభలోనే క్లారిటీ

Vijayashanthi Clarifies About Party Change
  • విజయశాంతి పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం
  • నిన్న మోదీ సభకు హాజరైన విజయశాంతి
  • పార్టీ మార్పు వార్తలను ఖండించిన బీజేపీ నేత
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల బాగా వైరల్ అవుతున్న వార్తల్లో విజయశాంతి పార్టీ మార్పు ఒకటి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెను పార్టీ పట్టించుకోవడం లేదని, త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఊహాగానాలు జోరుగా చక్కర్లు కొడుతున్నా ఆమె మాత్రం అధికారికంగా ఇప్పటి వరకూ స్పందించలేదు. 

ఈ ప్రచారం ఇలా సాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. మరో రెండుమూడు రోజుల్లో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలిపారు. 

మల్లు రవి కామెంట్స్‌పై విజయశాంతి వెంటనే స్పందించారు. తాను బీజేపీని వీడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరైన ఆమె మాట్లాడుతూ.. తాను బీజేపీని ఎందుకు వీడుతానని ప్రశ్నించి ఊహాగానాలకు చెక్ పెట్టారు.
Vijayashanti
BJP
Congress
Telangana

More Telugu News