PM Modi: సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో మోదీ

PM Modi celebrates Diwali with soldiers in remote Himachal Pradesh
  • చైనా బార్డర్ దగ్గర్లో జరుపుకున్న ప్రధాని
  • ఆర్మీ యూనిఫాం ధరించి సోల్జర్లతో మాటామంతి
  • 2014 నుంచి ప్రతీ దీపావళి సైనికులతోనే..
ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చా ఏరియాలో సైనికులను కలిసి మాట్లాడిన ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. చైనా బార్డర్ కు సమీపంలో ఉన్న ఈ ఏరియా అత్యంత కీలకమైన ప్రదేశం.. ఆదివారం ఉదయమే ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులు, అధికారులతో కలిసిపోయారు. దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మోదీ దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకుంటున్నారు. ఏటా ఏదో ఒక బార్డర్ ఏరియాకు వెళ్లి పండుగ పూట సైనికులను కలుస్తున్నారు. సరిహద్దులను కాపాడేందుకు కుటుంబానికి దూరంగా ఉంటున్న వారితో పండుగను సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు.
PM Modi
Diwali
Himachal Pradesh
soldiers
celebrattions

More Telugu News