Diwali: భర్త, కుమారుడితో కలిసి దీపావళి జరుపుకున్న కవిత.. వీడియో ఇదిగో!

May this Deepavali bring peace Kavitha Diwali Wishes
  • దీపావళి రోజున వెలుగులీనిన దేశం
  • చిన్నాపెద్దా అందరూ వేడుకల్లో మునిగిన వైనం
  • ఈ దీపావళి ప్రతి ఒక్కరిలోనూ శాంతి, సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించిన కవిత
దీపావళి పర్వదినాన దేశం మొత్తం వెలుగులీనింది. చిన్నాపెద్దా అందరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి సంతోషంగా పండుగ జరుపుకున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు అందరూ దీపావళిని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. ఇంటి ముందు పూలతో రంగవల్లులు తీర్చిదిద్దారు. భర్త, కుమారుడితో కలిసి దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రతి ఒక్కరిలోనూ శాంతి, సంతోషం, ప్రేమ నింపాలని ఆకాంక్షిస్తూ దీపావళి సెలబ్రేషన్స్ వీడియోను షేర్ చేశారు.
Diwali
Deepavali
MLC Kavitha
BRS

More Telugu News