Retail Inflation: అక్టోబరు మాసంలో దిగొచ్చిన చిల్లర ద్రవ్యోల్బణం
- అక్టోబరులో 4.87 శాతానికి తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం
- సెప్టెంబరులో 5.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం
- 6.61 శాతానికి పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం మరింత దిగొచ్చింది. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం... అక్టోబరు మాసంలో చిల్లర ద్రవ్యోల్బణం 4.87 శాతానికి తగ్గిపోయింది. సెప్టెంబరులో అది 5.2 శాతంగా ఉంది. ఆహార ధరలు బాగా తగ్గడంతో ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టింది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం మార్కుకు చేరువలో నిలిచింది. చిల్లర ద్రవ్యోల్బణం ఎగువ దశ సహన స్థాయి 2 శాతం నుంచి 6 శాతం మధ్య ఉంటే ఆరోగ్యదాయకమని ఆర్బీఐ చెబుతోంది. అక్టోబరు ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత స్థాయికి లోపే నమోదైంది. ఇక, ఆహార ద్రవ్యోల్బణం అక్టోబరు 6.61 శాతానికి పెరిగింది. సెప్టెంబరులో అది 6.56 శాతంగా ఉంది.