Srivari Mettu: తిరుమలలో చిరుత కలకలం.. కాలినడకన వెళ్లే భక్తులలో ఆందోళన

Leopard sighted on Srivari Mettu walkway TTD restricts movement of piligrims
  • శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం
  • అధికారులకు సమాచారం అందించిన భక్తులు
  • నడక మార్గంలో భక్తులను గుంపులుగా పంపిస్తున్న సిబ్బంది
తిరుమలలో మరోమారు కలకలం రేగింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించడమే దీనికి కారణం. నడక దారిన వెళుతున్న కొంతమంది భక్తులు చిరుతను చూసినట్లు సమాచారం. ఈ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేయగా.. అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులను గుంపులుగా అనుమతించాలని నిర్ణయించారు. ఒంటరిగా వెళ్లే భక్తులపై చిరుత దాడి చేసే అవకాశం ఉండడంతో సెక్యూరిటీ సిబ్బంది వాటర్ హౌస్ వద్ద భక్తులను ఆపుతున్నారు. గుంపులు గుంపులుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. మెట్ల దారి పక్కనే ఉన్న రోడ్డుపై చిరుత కనిపించిందని పులివెందులకు చెందిన భక్తులు చెప్పారు. వేగంగా రోడ్డు దాటుతున్న చిరుతను చూశామని వివరించారు. దీంతో వెంటనే ఫోన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సమాచారం అందించామని తెలిపారు.
Srivari Mettu
Leopard
piligrims
TTD restrictions
walkway

More Telugu News