Nimmagadda Ramesh Kumar: ఐప్యాక్, రామ్ ఇన్ఫో సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయి: నిమ్మగడ్డ రమేశ్
- గుంటూరులో ఓటర్ల సహాయ కేంద్రం ఏర్పాటు
- సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్
- సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ
గుంటూరులో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటర్ల సహాయ కేంద్రం ప్రారంభించారు. సహాయ కేంద్రంతో పాటు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, వాట్సాప్ నెంబర్లను కూడా ప్రారంభించారు. ఈ సహాయ కేంద్రాన్ని సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు అన్ని పత్రాలు సరిచూసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఓటరు జాబితాలో పేరు ఉందో, లేదో చూసుకోవాలని తెలిపారు. ఐప్యాక్, రామ్ ఇన్ఫో వంటి సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయని పేర్కొన్నారు.
నిమ్మగడ్డ రమేశ్ ఇటీవల తన స్వగ్రామంలో ఓటు సాధించుకున్నారు. ఆయన ఎంతో పోరాటం చేసిన మీదట సొంత ఊర్లో ఓటు హక్కు పొందగలిగారు.