Nara Lokesh: జగన్ గజగజా వణుకుతున్నారనే విషయం మరోసారి బయటపడింది: నారా లోకేశ్

Jagan is afraid of own constituency people says Nara Lokesh
  • బీటెక్ రవి అరెస్ట్ పై మండిపడ్డ నారా లోకేశ్
  • సొంత నియోజకవర్గానికి వెళ్లడానికి కూడా జగన్ భయపడుతున్నారని ఎద్దేవా
  • గెలిపించిన జనాలను చూడగానే భయపడుతున్నారని విమర్శ
టీడీపీ నేత బీటెక్ రవిని అరెస్ట్ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు అంశాలతో వాడీవేడిగా ఉన్న ఏపీ రాజకీయాలు ఈ ఘటనతో మరింత వేడెక్కాయి. మరోవైపు రవి అరెస్ట్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరకు పుట్టిన ఊరు, గెలిచిన నియోజకవర్గం పులివెందులకు వెళ్లాలన్నా జగన్ గజగజా వణుకుతున్నారని... బీటెక్ రవి అరెస్ట్ తో ఈ విషయం మరోసారి బయటపడిందని అన్నారు. జగన్ ఎక్కడకు వెళ్తే అక్కడ పరదాలు, బారికేడ్లు, దుకాణాల మూసివేత, ముందస్తు అరెస్ట్ లు, చెట్ల నరికివేతలు సర్వసాధారణమయ్యాయని విమర్శించారు. ఓట్లేసి గెలిపించిన జనాలను చూడగానే జగన్ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలనే ఎదుర్కోలేని పిరికిపంద జగన్ అని దుయ్యబట్టారు. 

Nara Lokesh
Telugudesam
BTech Ravi
Jagan
YSRCP
Pulivendula

More Telugu News