Chandrababu: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

AP High Court hearing on Chandrababu bail plea adjourned
  • అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టును కోరిన సీఐడీ తరపు లాయర్
  • దీంతో విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసిన హైకోర్టు
  • మాజీ మంత్రి నారాయణ పిటిషన్లపై విచారణ రెండు వారాలకు వాయిదా
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టును సీఐడీ తరపు న్యాయవాది కోరారు. దీంతో, విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది. 

మరోవైపు అసైన్డ్ భూముల కేసులో మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు చేపట్టింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Chandrababu
Telugudesam
Skill Development Case
AP High Court

More Telugu News