Rakesh: నమ్మినవాళ్లందరూ మధ్యలోనే మాయమయ్యారు: 'జబర్దస్త్' రాకేశ్

Rakesh Interview
  • 'జబర్దస్త్'తో పేరు తెచ్చుకున్న రాకేశ్ 
  • సినిమా కోసం నిర్మాతగా మారిన కమెడియన్ 
  • మధ్యలో కొందరు మోసం చేశారని వెల్లడి
  • ఎలాంటివారి మధ్య ఉంటున్నామనేది అర్థమైందని వ్యాఖ్య

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్ లో రాకింగ్ రాకేశ్ ఒకరు. చిన్న పిల్లలతో స్కిట్స్ చేస్తూ తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఒక సినిమాకి ఆయన నిర్మాతగా కూడా మారాడు. ఆ సినిమాకి సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నాడు. 

తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేశ్ మాట్లాడుతూ .. "నేను ఒక సినిమా తీయాలని చెప్పినప్పుడు 'మేము ఉన్నాము' అంటూ కొంతమంది సపోర్టు చేశారు. వాళ్లంతా ఉన్నారు కదా అని చెప్పి నేను ముందడుగు వేయగానే వాళ్లు మాయమైపోయారు. అప్పుడు నాకు జీవితమంటే ఏమిటో అర్థమైంది" అన్నాడు. 

"ఇంతవరకూ నేను చాలా అవమానాలనే ఎదుర్కుంటూ వచ్చాను. సినిమా తీయాలనే నా ప్రయాణంలో కొంతమంది మోసం చేశారు. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూనే ముందుకు వెళుతున్నాను. నా ఫ్యామిలీ సపోర్టు పూర్తిగా ఉంది. అందువలన నేను అనుకున్నది సాధించగలననే నమ్మకం ఉంది" అని చెప్పాడు.

Rakesh
Comedian
Tollywood

More Telugu News