Harbhajan: మైండ్ ఖరాబైందేమో డాక్టర్ కు చూపించుకో..: ఇంజమాముల్ హక్ పై హర్భజన్ సింగ్ ఫైర్

Harbhajan Singh slams Inzamam ul Haqs comments on conversion
  • హర్భజన్ అప్పట్లో ఇస్లాంలోకి మారేందుకు ఉత్సాహం చూపాడన్న ఇంజమాముల్ హక్  
  • తను ఏ మత్తులో ఇలాంటి కామెంట్ చేశాడో తెలియదన్న బజ్జీ   
  • ఇంజమామ్ ను ఎవరైనా మెంటల్ డాక్టర్ కు చూపించాలని రిక్వెస్ట్
టీమిండియా మాజీ ఆటగాడు, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా పాక్ మాజీ క్రికెటర్ ఇంజమాముల్ హక్ పై మండిపడ్డాడు. మంచి డాక్టర్ కు చూపించుకొమ్మని హితవు పలికాడు. తాను మతం మారేందుకు ప్రయత్నించానన్న ఆయన వ్యాఖ్యలను ఖండించాడు. మానసిక స్థితి సరిగా లేక నోటికి వచ్చిన స్టేట్ మెంట్లు ఇస్తున్నాడని ఫైర్ అయ్యాడు. సిక్కుగా పుట్టినందుకు గర్విస్తున్నానని, సిక్కుగానే జీవిస్తానని స్పష్టం చేశాడు. ఇంజమామ్ కు మానసిక స్థితి సరిగా లేనట్టుందని, ఎవరైనా ఆయనను సైకియాట్రిస్ట్ కు చూపించాలని హర్భజన్ కోరాడు. 

ఇటీవల ఇంజమామ్ మీడియాతో మాట్లాడుతూ.. హర్భజన్ సింగ్ అప్పట్లో ఇస్లాం మతంలోకి మారేందుకు ఉత్సాహం చూపించాడని చెప్పాడు. ఈ స్టేట్ మెంట్ కాస్తా వైరల్ కావడంతో భజ్జీ స్పందించాడు. ఇంజమామ్ మందు తాగి వచ్చాడో లేక ఏదైనా స్మోక్ చేశాడో.. దేని మత్తులో ఇలాంటి కామెంట్ చేశాడో తెలియదని అన్నాడు. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు రేపొద్దున ఆయనకే గుర్తుండవని హర్భజన్ సింగ్ చెప్పారు.
Harbhajan
Islam
conversion
Inzamam-ul-Haq
Ex cricketers
Pakistan
Bajji
Team India spinner

More Telugu News