Anushka Sharma: నువ్వు నిజంగా ఆ దేవుడి బిడ్డవు..అనుష్క శర్మ పోస్ట్ వైరల్

God is the best scripter writer anuskha sharma virat kohli
  • కోహ్లీని ప్రశంసిస్తూ భార్య అనుష్క శర్మ పోస్ట్
  • నీ ప్రేమ పొందినందుకు దేవుడికి రుణపడి ఉంటానని వ్యాఖ్య
  • దేవుడికి మించిన స్క్రిప్ట్ రైటర్ లేడని కామెంట్
దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన పవర్ కపుల్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే సమాధానం విరుష్కనే! ఎప్పుడూ ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలిచే వీరు ఆదర్శ జంటగా నెట్టింట ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక నిన్నటి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ప్రపంచరికార్డు నెలకొల్పడంతో అనుష్క శర్మ ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఆమె గ్యాలరీలోంచే విరాట్‌కు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. భర్త ఎదుగుదలను చూస్తూ ముసిపోతున్న ఆమె తాజాగా తన మనుసులో మాటను వెల్లడిస్తూ నెట్టింట మరో పోస్ట్ పెట్టింది. 

‘‘దేవుడు అత్యద్భుత స్క్రిప్ట్ రైటర్. నీ ప్రేమ నాకు దక్కినందుకు, నీ ఎదుగులను చూసే అవకాశం నాకిచ్చినందుకు ఆ భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మనసులోనూ, ఆటపై నిజాయతీగా ఉండే నువ్వు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు. నువ్వు నిజంగా దేవుడి బిడ్డవు’’ అంటూ ఆమె నెట్టింట పోస్ట్ చేసింది. విరాట్‌తో పాటూ ముహమ్మద్ షమీ, టీం సభ్యుల ఫొటోలను కూడా అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది.
Anushka Sharma
Virat Kohli
Crime News

More Telugu News