Virat Kohli: అనుష్క కనిపించదేం?.. తొంగితొంగి చూసిన కోహ్లీ.. వీడియో ఇదిగో!

Virat looks for Anushka in wankhede stadium during during match
  • భార్య అనుష్క కోసం వెతికిన కోహ్లీ
  • డ్రెస్సింగ్ రూం బాల్కనీ రెయిలింగ్ పట్టుకుని అనుష్క కోసం వెతుకులాట
  • ప్రేమకు నిర్వచనం అంటూ అభిమానుల కామెంట్లు
ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న భారత్-కివీస్ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ కొన్ని మధుర క్షణాలను మిగిల్చింది. భారత్ ఫైనల్‌కు చేరడంతోపాటు కోహ్లీ రికార్డు సెంచరీ, షమీ అత్యద్భుత షో ప్రేక్షకులు పండుగ చేసుకునేలా చేశాయి. 50వ సెంచరీ తర్వాత మైదానం నుంచి కోహ్లీ.. ఆడియన్స్ గ్యాలరీ నుంచి అనుష్క పరస్పరం గాల్లో ముద్దులు కురిపించుకునే వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా తిరుగుతోంది. 

తాజాగా, మరో వీడియో కూడా సోషల్ మీడియాకెక్కింది. భార్యాభర్తల అనుబంధాన్ని చాటిచెప్పే వీడియో ఇది. అనుష్కపై కోహ్లీకి ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమంటూ అభిమానులు పులకించి పోతున్నారు. డ్రెస్సింగ్ రూము నుంచి బయటకు వచ్చిన కోహ్లీ భార్య కోసం ఆత్రుతగా వెతకడం ఈ వీడియోలో కనిపించింది.

పై గ్యాలరీలో మరికొందరితో కలిసి మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుష్క కనబడుతుందేమోనని బాల్కనీ రెయిలింగ్‌ను పట్టుకుని మెడలు వంచి చూశాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో దర్శనమివ్వడం ఆలస్యమన్నట్టు వైరల్ అయింది. ఈ వీడియో మనసును కట్టిపడేసిందని ఒకరంటే.. ప్రేమకు నిర్వచనమని మరో యూజర్ రాసుకొచ్చాడు. వారిని అలా చూడడం బాగుందని ఇంకొందరు యూజర్లు కామెంట్ చేశారు. ఐకానిక్ ఫుటేజీ అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
Virat Kohli
Anushka Sharma
Wankhede Stadium
Virat-Anushka

More Telugu News