Australia: నిప్పులు చెరుగుతున్న ఆసీస్ పేసర్లు... 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

Aussies pacers on fire as SA lost 4 early wickets
  • వరల్డ్ కప్ లో నేడు రెండో సెమీఫైనల్
  • దక్షిణాఫ్రికా × ఆస్ట్రేలియా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • పిచ్ పై స్వింగ్ లభించడంతో చెలరేగిన స్టార్క్, హేజెల్ వుడ్
  • చెరో రెండు వికెట్లు తీసిన ఆసీస్ కొత్త బంతి బౌలర్లు
రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు ఆసీస్ పేసర్లు అగ్నిపరీక్ష పెట్టారు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ పై స్వింగ్ లభించడంతో మిచెల్ స్టార్క్, జోష్ హేజెల్ వుడ్ బుల్లెట్ బంతులతో చెలరేగారు. దాంతో దక్షిణాఫ్రికా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. స్టార్క్ 2, హేజెల్ వుడ్ 2 వికెట్లతో సఫారీ టాపార్డర్ పనిబట్టారు. 

మొదటి ఓవర్లోనే కెప్టెన్ టెంబా బవుమాను స్టార్క్ అవుట్ చేయగా... స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ను హేజెల్ వుడ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఐడెన్ మార్క్రమ్ రెండు ఫోర్లు కొట్టి రన్ రేట్ పెంచే ప్రయత్నం చేసినా స్టార్క్ బౌలింగ్ లో వార్నర్ క్యాచ్ పట్టడంతో అవుట్ కాకతప్పలేదు. ఆ తర్వాతి ఓవర్లోనే హేజెల్ వుడ్ విజృంభించి ఫామ్ లో ఉన్న వాన్ డర్ డుసెన్ ను అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా నాలుగో వికెట్ కోల్పోయింది. 

ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 13 ఓవర్లలో 4 వికెట్లకు 32 పరుగులు. హెన్రిచ్ క్లాసెన్ 3, డేవిడ్ మిల్లర్ 5 పరుగులతో ఆడుతున్నారు.
Australia
South Africa
Eden Gardens
2nd Semifinal
World Cup

More Telugu News