GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడా ఆగలేదు: జీవీఎల్

GVL talks about Visakha Railway Zone

  • విశాఖ డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే అధికారులతో జీవీఎల్ సమావేశం
  • రైల్వే జోన్ భవన నిర్మాణాలు జరుగుతాయని వెల్లడి
  • విశాఖ మీదుగా ఎక్కువ రైళ్లు నడిచేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోందన్న జీవీఎల్ 

సుదీర్ఘకాలంగా నలుగుతున్న విశాఖ రైల్వే జోన్ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ ఎక్కడా ఆగలేదని స్పష్టం చేశారు. భవన నిర్మాణాలు జరుగుతాయని అన్నారు. విశాఖ కేంద్రంగా ఉన్న రైల్వే పెండింగ్ సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించానని వెల్లడించారు. పెందుర్తిలో స్టేషన్ నిర్మించాలని కోరానని... సింహాచలం-దువ్వాడ స్టేషన్ అభివృద్ధి అంశంపై ప్రతిపాదనలు చేశానని జీవీఎల్ వివరించారు. 

త్వరలో వారణాసి-విశాఖ రైలు రాబోతోందని తెలిపారు. విశాఖ మీదుగా పెద్ద సంఖ్యలో రైళ్లు నడిపేందుకు రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు. విశాఖలో ఈస్ట్ కోస్ట్ రైల్వే డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తో సమావేశం అనంతరం జీవీఎల్ ఈ సంగతులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News