Kane Williamson: కొందరు 50 మ్యాచ్ లు ఆడితేనే గొప్ప కెరీర్ అంటారు... కోహ్లీ 50 సెంచరీలు చేస్తే ఇంకేమనాలి?: విలియమ్సన్
- నిన్న న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ సెమీస్ ఆడిన టీమిండియా
- 50వ సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించిన కోహ్లీ
- సచిన్ రికార్డు తెరమరుగు
- కోహ్లీ అంతకంతకు ఎదిగిపోతున్నాడన్న విలియమ్సన్
న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ 50వ సెంచరీతో వన్డేల్లో సరికొత్త రికార్డు నమోదు చేయడం తెలిసిందే. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించి చరిత్ర సృష్టించాడు. దీనిపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు.
"కొందరు 50 మ్యాచ్ లు ఆడితేనే గొప్ప కెరీర్ అంటారు. అలాంటిది ఓ ఫార్మాట్లో 50 సెంచరీలు చేస్తే ఇంకేమనాలి? అత్యద్భుతం అనాలి. విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు... అందులో ఎలాంటి సందేహం లేదు. కోహ్లీ అంతకంతకు ఎదిగిపోతున్నాడు" అని వివరించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. అంతేకాదు, మ్యాచ్ ముగిశాక కోహ్లీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను కూడా విలియమ్సన్ పంచుకున్నాడు.
కోహ్లీ, విలియమ్సన్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ అండర్-19 స్థాయి నుంచే స్నేహితులు.