Venkatesh: డేవిడ్ బెక్ హామ్, వివియన్ రిచర్డ్స్ తో విక్టరీ వెంకటేశ్... ఫొటోలు ఇవిగో!

Venkatesh takes selfies with David Beckham and Vivian Richards
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో నిన్న సెమీస్ మ్యాచ్
  • న్యూజిలాండ్ పై టీమిండియా విన్
  • మ్యాచ్ కు హాజరైన ప్రముఖులు
  • గొప్ప వ్యక్తులతో కలిసి గొప్ప ఇన్నింగ్స్ చూశానన్న వెంకటేశ్
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కు ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అంతర్జాతీయ మాజీ సాకర్ లెజెండ్ డేవిడ్ బెక్ హామ్, క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కూడా హాజరయ్యారు. కాగా, ఈ సెమీఫైనల్ మ్యాచ్ కు టాలీవుడ్ అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్ కామెంటరీ కూడా చెప్పి అభిమానులను అలరించారు. 

ఈ సందర్భంగా వెంకటేశ్... డేవిడ్ బెక్ హామ్, రిచర్డ్స్ లను కలిసి వారితో సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోలను వెంకీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. గొప్ప వ్యక్తులతో కలిసి గొప్ప ఇన్నింగ్స్ చూశాను అని ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ కు విచ్చేసిన వెంకీ వైన్ కలర్ జాకెట్,  బ్లాక్ టీషర్టులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో కనిపించారు. 

వెంకీ ప్రస్తుతం 'సైంధవ్' చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' చిత్రంలోనూ వెంకటేశ్ తళుక్కుమన్నారు.
Venkatesh
David Beckham
Vivian Richards
Semifinal
Mumbai
World Cup

More Telugu News