Ind Vs Aus: వరల్డ్ కప్ ఫైనల్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన ఎయిర్ షో
- ఆహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా × ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్
- మ్యాచ్ ప్రారంభానికి ముందు వీక్షకుల కోసం భారత వాయుసేన ఎయిర్ షో
- సూర్యకిరణ ఆక్రోబాటిక్ టీం విన్యాసాలు
అహ్మదాబాద్‌లో ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేన ప్రేక్షకులను అచ్చెరవొందేలా ఓ ఎయిర్ షో ప్లాన్ చేసింది. ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం యుద్ధవిమానలతో స్టేడియం గగనతలంపై విన్యాసాలు చేయనున్నారు.
వికర్టీ ఫార్మేషన్, లూప్ మెనూవర్స్, బ్యారెల్ రోల్ ఫార్మేషన్, ఆకాశంలో వివిధ ఆకృతుల డిజైన్ వంటి విన్యాసాలు నిర్వహించనున్నట్టు వాయుసేన అధికారిక ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు. మొత్తం 10 నిమిషాల పాటు ఈ విన్యాసాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఎయిర్ షోకు సంబంధించిన రిహార్సల్స్ శుక్ర, శనివారాల్లో జరుపుతారు. మొత్తం తొమ్మిది విమానాలున్న సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీం ఇప్పటికే పలు ముఖ్య కార్యక్రమాల్లో ఎయిర్ షో నిర్వహించింది. ఇక ఈ మ్యాచ్ తిలకించేందుకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. కాగా, ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకుంది.