Quinton de Kock: ప్రపంచకప్‌లో ధోనీ, గిల్‌క్రిస్ట్‌కు సాధ్యంకాని రికార్డు అందుకున్న డికాక్
- ప్రపంచకప్ సింగిల్ ఎడిషన్‌లో 500 పరుగులు చేసి, 20 మందిని పెవిలియన్ కి పంపిన డికాాక్
- ప్రపంచకప్ చరిత్రలోనే ఇది తొలిసారి
- 2015 ప్రపంచకప్‌లో 237 పరుగులు చేసి 15 మందిని పెవిలియన్ చేర్చిన ధోనీ
ప్రస్తుత ప్రపంచకప్‌లో అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకున్న దక్షిణాఫ్రికా సెమీస్‌లో మాత్రం చతికిలపడి తన ప్రస్థానాన్ని ముగించింది. కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన సెమీస్‌లో పోరాడి ఓడింది. ఇదే తన చివరి ప్రపంచకప్ అని ప్రపంచకప్ ప్రారంభానికి ముందు సఫారీ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ ప్రకటించాడు. ఈ టోర్నీలో భీకర ఫామ్‌తో ప్రత్యర్థులకు వణుకుపుట్టించిన డికాక్ 594 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ టోర్నీలో ఇన్ని శతకాలు సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. బ్యాట్‌తోనే కాదు, వికెట్ కీపర్‌గానూ శభాష్ అనిపించుకున్నాడు. 20 మందిని అవుట్ చేశాడు. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 16 మందిని పెవిలియన్ చేర్చాడు.
ప్రపంచకప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో 500 పరుగులు సాధించి 20 మందిని ఔట్ చేసిన ఏకైక ఆటగాడిగా డికాక్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 2003లో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ వికెట్ల వెనక 21 మందిని అవుట్ చేశాడు. బ్యాట్‌తో మాత్రం 408 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ 2015 ప్రపంచకప్‌లో 237 పరుగులు చేసి, 15 మందిని అవుట్ చేశాడు. అలాగే, టామ్ లాథమ్ 21 వికెట్లు (2019), అలెక్స్ కేరీ 20 వికెట్లు (2019), కుమార్ సంగక్కర 17 (2003), ఆడం గిల్‌క్రిస్ట్ 17(2007) వికెట్లు సాధించారు.