Vijayashanti: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి... కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

Vijayashanthi joins congress in the presence of Kharge
  • రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన రాములమ్మ
  • నేడు గాంధీ భవన్‌లో ఖర్గే, కాంగ్రెస్ నేతలను కలిసిన విజయశాంతి
  • పార్టీలోకి ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన విజయశాంతి
రాములమ్మ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న గాంధీభవన్‌లో మల్లికార్జున ఖర్గే... ఆమెకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె ట్వీట్ చేశారు. 'ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన, కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..' అంటూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, మెదక్ లోక్ సభ సీటు హామీతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. విజయశాంతి రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
Vijayashanti
Congress
Mallikarjun Kharge
Telangana Assembly Election

More Telugu News