Yatra: రజనీకాంత్ మనవడికి పోలీసుల జరిమానా

Rajinikanth grandson Yatra was fined by traffic police
  • స్పోర్ట్స్ బైక్ పై హెల్మెట్ లేకుండా దూసుకెళ్లిన యాత్ర
  • ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ ల పెద్ద కుమారుడే యాత్ర
  • వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వ్యక్తి
  • బైక్ నెంబర్ ఆధారంగా యాత్రకు రూ.1000 జరిమానా వేసిన పోలీసులు
తమిళ స్టార్ హీరో ధనుష్ తనయుడు, తలైవా రజనీకాంత్ మనవడు యాత్ర పోలీసు జరిమానాకు గురయ్యాడు. ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ ల పెద్ద కుమారుడే యాత్ర. కొన్నిరోజుల కిందట యాత్ర ఓ స్పోర్ట్స్ బైక్ పై రయ్యిమంటూ దూసుకెళుతూ కనిపించాడు. ఆ సమయంలో అతడికి హెల్మెట్ లేదు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు దీనిపై దృష్టి సారించారు. బైక్ నెంబర్ ఆధారంగా అది ధనుష్ బైక్ అని పోలీసులు గుర్తించారు. బైక్ నడిపిన యాత్రకు రూ.1000 జరిమానా విధించారు.
Yatra
Fine
Bike
Dhanush
Rajinikanth
Chennai
Kollywood

More Telugu News