K Kavitha: నేను బాగానే ఉన్నా: కవిత

Iam fine says Kavitha

  • ఇటిక్యాలలో ప్రచారం నిర్వహిస్తుండగా అస్వస్థత
  • కళ్లు తిరిగి పడిపోయిన వైనం
  • స్థానిక కార్యకర్త ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న కవిత

ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. ఆ తర్వాత ఆమె స్థానికంగా ఉన్న ఓ కార్యకర్త ఇంట్లో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఆమె తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. 

మరోవైపు తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎక్స్ వేదికగా ఆమె తెలిపారు. విశ్రాంతి తీసుకున్న ఇంట్లో ఒక చిన్నారితో ముచ్చటించిన వీడియోను ఆమె షేర్ చేశారు. చిన్నారితో గడిపిన తర్వాత తనకు మరింత శక్తి వచ్చినట్టు అనిపించిందని చెప్పారు. డీహైడ్రేషన్ కారణంగా ఆమెకు కళ్లు తిరిగినట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News