Rohit Sharma: మేం ఆయన కోసం కప్ గెలవాలనుకుంటున్నాం: రోహిత్ శర్మ

Rohit Sharma says the team wants to win world cup for Rahul Dravid

  • రేపు అహ్మదాబాద్ లో వరల్డ్ కప్ ఫైనల్
  • ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా
  • టీమిండియా విజయాల వెనుక ద్రావిడ్ ఉన్నాడన్న రోహిత్
  • ఆటగాడిగా ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవని ద్రావిడ్
  • ఆ లోటును తాము తీర్చుతామన్న రోహిత్ శర్మ

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ టీమిండియా సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా విజయాల వెనుక ప్రధానమైన వ్యక్తి కోచ్ రాహుల్ ద్రావిడ్ అని చెప్పాడు. జట్టులోని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించే ద్రావిడ్ వైఖరి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి కోసం తాము వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నామని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఇలాంటి చారిత్రక ఘట్టంలో తాను కూడా ఓ భాగం కావాలని ద్రావిడ్ తప్పకుండా ఆకాంక్షిస్తుంటాడని అభిప్రాయపడ్డాడు. 

"ఆటగాళ్లుగా మేం భిన్నమైన వాళ్లం. రాహుల్ భాయ్ ఆడినప్పటి రోజులకు, ఇప్పుడు నేను ఆడుతున్న రోజులకు చాలా తేడా ఉంది. తన అనుభవాలను ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. మీరు ఎలా ఆడాలనుకుంటారో అలాగే ఆడండి అని భుజం తట్టి చెబుతారు" అని రోహిత్ శర్మ వివరించారు.

భారత క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రావిడ్ కు ప్రత్యేక అధ్యాయం ఉంది. బ్యాటింగ్ లో దుర్భేద్యమైన టెక్నిక్ తో ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లను దీటుగా ఎదుర్కొని టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. టెస్టుల్లో 13,288... వన్డేల్లో 10,889 పరుగులు నమోదు చేశాడు. 

1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ కర్ణాటక కిశోరం 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. మహోన్నత బ్యాట్స్ మన్ గా ఖ్యాతి పొందినప్పటికీ, సుదీర్ఘ కెరీర్ లో ఒక్క వరల్డ్ కప్ టైటిల్ కూడా లేకపోవడం ద్రావిడ్ కెరీర్ కు వెలితిగా ఉండిపోయింది. ఇప్పుడా లోటును పూరించాలని రోహిత్ సేన దృఢ నిశ్చయంతో ఉంది.

  • Loading...

More Telugu News