Shahid Afridi: టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- నిన్న వరల్డ్ కప్ ఫైనల్
- గిల్, రోహిత్, అయ్యర్ ల వికెట్లు కోల్పోయిన సమయంలో అఫ్రిది వ్యాఖ్యలు
- మితిమీరిన ఆత్మవిశ్వాసానికి టీమిండియా మూల్యం చెల్లించుకునేలా ఉందని కామెంట్
వరుసగా 10 మ్యాచ్ ల్లో నెగ్గిన టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపాలవుతుందని ఎవరూ ఊహించలేదు. కాగా, నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా మితిమీరిన ఆత్మవిశ్వాసానికి తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే అతి ఆత్మవిశ్వాసం నెలకొంటుందని, టీమిండియా ఇప్పుడు దానికే బలయ్యేలా ఉందని వ్యాఖ్యానించాడు.
ఫైనల్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా... ఓపెనర్ శుభ్ మాన్ గిల్, కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలోనే అఫ్రిది వ్యాఖ్యలు చేశాడు. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.