State Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రూ.1,760 కోట్లు పట్టివేత... తెలంగాణలోనే అత్యధికం

EC seizes Rs 1760 crore in five states

  • నగదు, ఉచితాలు, డ్రగ్స్, మద్యం, బంగారం వంటి ఖరీదైన వస్తువుల స్వాధీనం
  • 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు ఐదు రెట్లు ఎక్కువగా పట్టివేత
  • తెలంగాణలో రూ.659 కోట్ల విలువైన నగదు, మద్యం, ఖరీదైన లోహాల స్వాధీనం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.1760 కోట్ల విలువైన నగదు, ఉచితాలు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం సోమవారం తెలిపింది. ఈ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా పట్టుబడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పటి వరకు ఏడు రెట్లు ఎక్కువగా పట్టుకున్నారు. అప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లో దాదాపు రూ.240 కోట్ల మేర జఫ్తు చేయగా, ఈసారి రూ.1,760 కోట్లు పట్టుకున్నారు.

 తెలంగాణలో రూ.225.25 కోట్ల నగదు సహా మొత్తం రూ.659 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మిజోరాంలో నగదు లేదా బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోలేదని తెలిపింది. రూ.29.82 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపింది. కాగా, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలు పూర్తి కాగా, రాజస్థాన్, తెలంగాణలలో నవంబర్ 25, నవంబర్ 30న జరగనున్నాయి. 

  • Loading...

More Telugu News