James Webb Telescope: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కంటికి చిక్కిన అరుదైన చిత్రం.. శాస్త్రవేత్తల్లో ఆశ్చర్యం

 James webb telescope takes Sagittarius C is a starforming region in milkyway galaxy
  • పాలపుంతకు హృదయం లాంటి ప్రాంతాన్ని ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్
  • 5 లక్షలకు పైగా ప్రోటోస్టార్స్‌తో వెలిగిపోతున్న ప్రాంతం
  • వీటిలో అధిగ భాగం సూర్యుడికంటే 30 రెట్ల పెద్దవిగా ఉన్నట్టు గుర్తింపు
విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అత్యంత అరుదైన దృశ్యాన్ని ఫొటో తీసింది. మనం ఉంటున్న మిల్కీ వే గెలాక్సీకి హృదయంగా పేరు పడ్డ ప్రదేశాన్ని క్లిక్‌మనిపించింది. సైంటిస్టులు సాగిటేరియస్-సీగా పేరుపెట్టిన ఈ ప్రదేశంలో సుమారు 5 లక్షల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో అధికభాగం, నక్షత్రాలుగా రూపాంతరం చెందే దశలో ఉన్న ప్రోటోస్టార్స్. ఇవి ఒక్కోటీ మన సూర్యుడికంటే సగటున 30 రెట్లు పెద్దవిగా ఉన్నాయని తెలిసింది. మిల్కీవే గెలాక్సీ మధ్యలో భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి భారీ కృష్ణ బిలానికి (బ్లాక్ హోల్) సమీపంలో ఈ ‘పాలపుంత హృదయం’ ఉంది.

ఈ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలకు గతంలోనే తెలిసినా తొలిసారిగా ఇది కెమెరా కంటికి చిక్కింది. దీంతో, శాస్త్రవేత్తలో ఆశ్చర్యానందాలు వ్యక్తమవుతున్నాయి. పాలపుంత కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేస్తే గెలాక్సీల పుట్టుకకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
James Webb Telescope
Sagittarius C
Milkyway Galaxy

More Telugu News