Sara Tendulkar: రామ్ చరణ్ సరసన సారా టెండూల్కర్?

Sara Tendulkar to pair with Ramcharan in Buchibabu movie
  • చెర్రీతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్న డైరెక్టర్ బుచ్చిబాబు
  • ప్రస్తుతం కొనసాగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  • సారా టెండూల్కర్ కోసం ప్రయత్నిస్తున్న బుచ్చిబాబు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల తనయ సారా టెండూల్కర్ ఇటీవలి కాలంతో వార్తల్లో నిలుస్తోంది. యంగ్ స్టార్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో ఆమె ప్రేమలో ఉందని... త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సారాకు చెందిన మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ సరసన సారా నటించబోతోందనేదే ఆ వార్త. 

వివరాల్లోకి వెళ్తే, రామ్ చరణ్ తో యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు, ఈ సినిమాలో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట. చెర్రీ సరసన సారా టెండూల్కర్ ను నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారట. మరి, బుచ్చిబాబు ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
Sara Tendulkar
Sachin Tendulkar
Ramcharan
Tollywood

More Telugu News