Hyderabadi Restaurent: ప్రపంచంలోని అత్యుత్తమ రెస్టారెంట్లలో హైదరాబాద్ ‘ఆదా’

Hyderabadi Restaurent In La Liste Ranking list
  • వరల్డ్ టాప్ 1000 రెస్టారెంట్లలో పలు భారతీయ రెస్టారెంట్లు
  • భారత్ లో ఢిల్లీలోని ఇండియన్ యాక్సెంట్ కు మొదటి స్థానం
  • ఫ్రాన్స్ కు చెందిన రెస్టారెంట్ గైడ్ కంపెనీ ‘లా లిస్టే’ ర్యాంకింగ్
ప్రపంచంలోనే అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్ చోటు దక్కించుకుంది. టాప్ 1000 రెస్టారెంట్లలో ఒకటిగా ఫలక్ నుమా ప్యాలెస్ లోని ‘ఆదా’ రెస్టారెంట్ నిలిచింది. ఫ్రాన్స్ కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ ‘లా లిస్టే’ ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో మన భారతీయ నగరాలకు చెందిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం మన దేశంలో అత్యుత్తమ రెస్టారెంట్ గా ఢిల్లీలోని ‘ఇండియన్ యాక్సెంట్’ నిలిచింది.

ఈ రెస్టారెంట్ కు లా లిస్టే 95 పాయింట్లు ఇచ్చింది. ఆ తర్వాత 86 పాయింట్లతో బెంగళూరులోని కరావల్లి రెస్టారెంట్ రెండో స్థానంలో, 84 పాయింట్లతో హైదరాబాదీ ‘ఆదా’ మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాదీ వంటకాలకు అత్యంత ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్ గా ఆదా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. అమెరికాకు చెందిన లే బెర్నార్డిన్ రెస్టారెంట్ సహా ప్రపంచంలోని మొత్తం ఏడు రెస్టారెంట్లు 99.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాయి.

‘లా లిస్టే’ ప్రకారం ఇండియాలోని టాప్ 10 రెస్టారెంట్లు..
  • ఇండియన్ యాక్సెంట్ (న్యూఢిల్లీ)
  • కరావల్లి (బెంగళూరు)
  • ఆదా (ఫలక్ నుమా ప్యాలెస్, హైదరాబాద్)
  • యౌచా (ముంబై)
  • దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ)
  • జమావర్ (లీలా ప్యాలెస్, బెంగళూరు)
  • లే సర్క్యూ సిగ్నేచర్ (లీలా ప్యాలెస్, బెంగళూరు)
  • మేగు (న్యూఢిల్లీ)
  • బుఖారా (ఐటీసీ మౌర్య, న్యూఢిల్లీ)
  • జియా (ముంబై)
Hyderabadi Restaurent
Adaa
Falaknuma palace
La Liste
world top Restaurents

More Telugu News