Barrelakka: తగ్గేదే లే.. బర్రెలక్క మ్యానిఫెస్టో చూశారా?

Kollapur Independent Candidate Barrelakka Released Her Manifesto
  • తెలంగాణ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క
  • నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హామీ
  • ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదలయ్యేలా చూస్తానన్న శిరీష
  • నిరుద్యోగ భృతి కోసం పోరాడతానని ప్రతిన
తెలంగాణ ఎన్నికల్లో ఏదైనా సెన్షేషన్ ఉందంటే అది బర్రెలక్క పోటీ మాత్రమే. చదువుకున్నప్పటికీ ఉద్యోగం రాక, బర్రెలు కాసుకుని తన అనుభవాలను రీల్స్ రూపంలో షేర్ చేస్తూ ఫేమస్ అయిన శిరీష అలియాస్ బర్రెలక్క కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆమె పేరు మరోమారు తెలంగాణలో మార్మోగిపోయింది. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆమె నిర్ణయాన్ని కొనియాడిన ఎంతోమంది ఆమెకు మద్దతుగా తరలివస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ జనాల్లోకి తీసుకెళ్తున్నారు. కొల్లాపూర్‌లో ఇప్పుడామె పేరు మార్మోగిపోతోంది. 

బర్రెలక్క తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని, ఉద్యోగ నోటిఫికేషన్లు సకాలంలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తానని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అలాగే, పేదల ఇళ్ల నిర్మాణానికి కృషి చేయడంతోపాటు నిరుద్యోగులందరికీ భృతి ఇప్పిస్తానని, ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఉచిత విద్య, వైద్యం, నిరుద్యోగులకు ప్రత్యేక కోర్సులు, ఉచిత శిక్షణ, ఉన్నత చదువుల కోసం కోచింగ్ ఉచితంగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని శిరీష తన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
Barrelakka
Sirisha
Kollapur
Barrelakka Manifesto
Telangana Assembly Election

More Telugu News