Surya Kumar Yadav: మీడియా సమావేశంలో ఇద్దరు విలేకరులే కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీమిండియా కెప్టెన్

Surya Kumar Yadav stunned after seeing two journalists in media conference ahead of 1st T20
  • టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నేడు వైజాగ్ లో తొలి టీ20 మ్యాచ్
  • టీమిండియాకు తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న సూర్య కుమార్ యాదవ్
ఇవాళ విశాఖలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. ఈ మ్యాచ్ ముంగిట మీడియా సమావేశానికి హాజరైన టీమిండియా తాత్కాలిక సారథి సూర్యకుమార్ యాదవ్ కు ఊహించని అనుభవం ఎదురైంది. మీడియా సమావేశం జరిగే హాల్లో ఇద్దరు విలేకరులు మాత్రమే కనిపించడంతో సూర్యా భాయ్ ఆశ్చర్యానికి గురయ్యాడు. మీ ఇద్దరేనా వచ్చింది...? అంటూ నవ్వుతూ ప్రశ్నించాడు. ఆపై కాసేపు మ్యాచ్ గురించి మాట్లాడి వెళ్లిపోయాడు.

ఇటీవలే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా, ఆసీస్ జట్లు తలపడగా... ఆసీస్ విజేతగా అవతరించింది. తాజాగా, ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు రెండు జట్లలోని ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. టీమిండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ వహిస్తుండగా, ఆసీస్ జట్టుకు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ నాయకత్వం వహిస్తున్నాడు.
Surya Kumar Yadav
Media Conference
Vizag
1st T20
Team India
Australia

More Telugu News