Director Ravindra: అమ్మాయిలతో కలిసి సినీ నిర్మాతను ముగ్గులోకి దింపి డబ్బు గుంజే యత్నం.. దర్శకుడి అరెస్ట్

Kannada director Ravindra arrested for blackmailed Chingari producer Mahadev
  • ఈజీమనీ కోసం దర్శకుడు రవీంద్ర వక్రబుద్ధి
  • అమ్మాయిలతో కలిసి నిర్మాత మహదేవ్‌ను ముగ్గులోకి దింపిన వైనం
  • ఆపై డబ్బుల కోసం వేధింపులు
  • ఆగడాలు మితిమీరడంతో పోలీసులకు నిర్మాత ఫిర్యాదు
కన్నడ సినీ నిర్మాతను వలపు వలలో దించి ఆపై డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన దర్శకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈజీగా డబ్బు సంపాదించాలన్న వక్రబుద్ధితో కన్నడ చిత్ర దర్శకుడు రవీంద్ర కొందరు అమ్మాయిలో కలిసి పథక రచన చేశాడు. నిర్మాత మహదేవ్ వద్దకు యువతులను పంపి ఆయనను ముగ్గులోకి దింపాడు. తమ పథకం పారిన తర్వాత వారు తమ వికృత రూపాన్ని బయటపెట్టారు. డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టారు. అడిగిన మొత్తం ఇవ్వకుంటే లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరించారు. 

వారి వేధింపులు రోజురోజుకు శ్రుతిమించడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దర్శకుడు రవీంద్రను నిందితుడిగా తేల్చారు. అతడే అమ్మాయిలతో కలిసి ఈ నాటకం ఆడుతున్నట్టు గుర్తించి నిన్న అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర ‘బారబాత్’ సినిమాకు దర్శకత్వం వహించగా, నిర్మాత మహదేవ్.. చింగారి, శ్రీకంఠ, శిశిర తదితర సినిమాలను నిర్మించారు.
Director Ravindra
Chingari Producer
Mahadev
Kannada
Bengaluru

More Telugu News