Revanth Reddy: వాతావరణం అనుకూలించక వెనక్కి మళ్లిన రేవంత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్

Revanth Reddy helicopter returned back to Hyderabad as weather not good
  • హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన రేవంత్
  • వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ కు తిరుగుపయనం
  • రేపు, ఎల్లుండి తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వాతావరణం ప్రతికూలంగా మారింది. పలుచోట్ల వర్షాలు, గాలులు ప్రచారానికి అడ్డంకిగా మారుతున్నాయి. వాతావరణం అనుకూలించక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తిరుగుముఖం పట్టింది. ఈరోజు నాలుగు ప్రాంతాల్లో రేవంత్ ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన హెలికాప్టర్ లో బయల్దేరిన తర్వాత వాతావరణం అనుకూలించలేదు. దీంతో హెలికాప్టర్ హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. అనంతరం రేవంత్ హైదరాబాద్ నుంచి నకిరేకల్ కు రోడ్డు మార్గంలో బయల్దేరారు. 

మరోవైపు  హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రియాంకాగాంధీ హెలికాప్టర్ లో పాలకుర్తికి వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె కూడా రోడ్డు మార్గంలోనే పాలకుర్తికి చేరుకున్నారు. ఇంకోవైపు, రేపు, ఎల్లుండి తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉంది. దీంతో నేతల ప్రచార సభలకు మరింత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి.
Revanth Reddy
Congress
Helicopter

More Telugu News