Dharmapuri Arvind: కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్టే: ధర్మపురి అర్వింద్

Revanth Reddy is listening Chandrababu Dharmapuri Arvind
  • చంద్రబాబు వర్గ నేతలంతా కాంగ్రెస్ లో ఉన్నారన్న అర్వింద్
  • చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ చేస్తున్నారని వ్యాఖ్య
  • రేవంత్ కన్నా కేసీఆర్ బెటర్ అన్న బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణను టీడీపీ చేతిలో పెట్టినట్టేనని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వర్గ నాయకులంతా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నారని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ బెటర్ అని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదేళ్ల పాటు పోరాడారని... ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారని అన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్పినట్టే రేవంత్ చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ ను తానే కట్టానని 2018 ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణను రేవంత్ రెడ్డి హోల్ సేల్ గా అమ్మేస్తారని అన్నారు. 

Dharmapuri Arvind
BJP
Revanth Reddy
Congress
KCR
BRS
Chandrababu
Telugudesam

More Telugu News