Mohammed Shami: రోడ్డు ప్రమాదం.. బాధితుడిని కాపాడిన ముహమ్మద్ షమీ

Mohammed Shami rescues road accident victim in Nainital
  • నైనిటాల్ ఘాట్ రోడ్డులో ప్రమాదం
  • అదుపు కోల్పోయి ప్రమాదంలో పడ్డ కారు
  • క్షతగాత్రుడిని కాపాడిన షమీ, సోషల్ మీడియాలో ఘటన గురించి వెల్లడి
రోడ్డు ప్రమాదం బారిన పడ్డ ఓ వ్యక్తిని భారత క్రికెటర్ ముహమ్మద్ షమీ రక్షించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా నెట్టింట పంచుకున్నాడు. ‘‘అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి రెండో జీవితాన్ని ఇచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డు మీద మేము వెళుతుండగా మా ముందున్న కారు అదుపు కోల్పోయి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. క్షతగాత్రుడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం’’ అని షమీ తెలిపాడు.

ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ముహమ్మద్ షమీ భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల తరువాత బరిలోకి దిగిన అతడు ఏకంగా 24 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే, ఫైనల్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది.
Mohammed Shami
Cricket
Nainital

More Telugu News