Prabhas: మార్కెట్ లోకి సలార్ టీషర్టులు.. ధర ఎంతంటే..!

Salaar T shirts Released Into Market
  • సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన మూవీ మేకర్స్
  • సలార్ టీ షర్ట్ ధర రూ.500 నుంచి రూ.1500
  • హొంబలె ఫిల్మ్స్ వెబ్ సైట్ లో అందుబాటులోకి..
ప్రభాస్ కొత్త సినిమా సలార్ వచ్చే నెల 22న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ మేకర్స్ ‘సలార్ టీ షర్ట్స్’ ను మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సినిమా నిర్మించిన హొంబలె ఫిల్మ్స్ వెబ్ సైట్ ద్వారా వీటిని అమ్మకానికి పెట్టారు. ఒక్కో టీ షర్ట్ ధర రూ.499 నుంచి రూ.1,499 వరకు ఉంది.

టీషర్టులు, హుడీలు, హార్మ్ స్లీవ్ లను కూడా అమ్మకానికి పెట్టారు. అయితే, టీషర్ట్స్ రేటు చూసి అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అంతేసి ధరలు పెడితే సామాన్యులు ఎలా కొంటారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీ షర్ట్ కొంటేనే అభిమానం ఉన్నట్లా.. ఇప్పుడు టీ షర్ట్ కోసం అంత డబ్బు పెట్టలేనని మరో యూజర్ కామెంట్ చేశాడు. అభిమానుల క్రేజ్ ను ఇలా కూడా క్యాష్ చేసుకుంటున్నారా అంటూ మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
Prabhas
salaar
tshirts
salaar shirts
Hombale Films
pan india movie

More Telugu News