MDMK Vaiko: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారు: ఎండీఎంకే నేత వైగో

Tamil Tiger chief Velupillai Prabhakaran still alive claims MDMK leader
  • ప్రభాకరన్ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించిన వైగో
  • కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్న వైనం
  • ప్రభాకరన్ బతికే ఉన్నారని తాము నమ్ముతున్నామని వ్యాఖ్య
ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని ఎండీఎంకే జనరల్ సెక్రెటరీ వైగో సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన అనంతరం వైగో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్ళై ప్రభాకరన్ జీవించే ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఆయన పుట్టినరోజు వేడుకలను కేక్‌ కట్ చేసి జరుపుకున్నాం. ప్రభాకరన్ వెంటే ఉన్న పాజ నెడుమారన్, కాశీ ఆనందన్ లాంటి వారు ఈ విషయంలో అబద్ధాలు చెప్పరు’’ అని ఆయన అన్నారు. 

ప్రభాకరన్ బతికే ఉన్నారని, త్వరలో ప్రజల ముందుకు వస్తారని తమిళ జాతీయవాది పాజ నెడుమారన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పేర్కొన్నారు. ప్రభాకరన్ మరణం నిజమే అయితే శ్రీలంక ప్రభుత్వం ఆయన మృతికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎందుకు విడుదల చేయదని మరో తమిళనేత ఆనందన్ ప్రశ్నించారు. దాదాపు 14 ఏళ్ల క్రితం శ్రీలంక ప్రభుత్వం తాము ప్రభాకరన్‌ను మట్టుబెట్టామని ప్రకటించిన విషయం తెలిసిందే.
MDMK Vaiko
Velupillai Prabhakaran
LTTE
Sri Lanka
Tamilnadu

More Telugu News